ప్రభుత్వాల నిర్లక్షము వల్ల, భ్యూరోక్రాట్లు కరప్షన్ వల్ల, ప్రజల తెలియని తనము వల్ల, ఈరోజున భారత దేశము ఒక పెను సంక్షోబాన్ని ఎదుర్కోంటుంది. అది నీటి కోరత.
మనుషులు, జంతువులు, వృక్షాలు, ఇతర జీవ జాతులు, పర్యావరణము, పృధ్వి, అందరు నీటి రాహిత్యము వల్ల ఇబ్బందులు పడుతున్నారు/యి.
వర్షాధారిత నీరు వృదాగా సముద్రములోకలసిపోతుంది.
భూగర్భ జలాలు అంతరించాయి.
ఉపరితల జలాశయాలు అంతరించాయి.
బావులు ఓట్టిపోయాయి.
చెరువులు ఎండి పోయాయి.
సరస్సులు నిర్వీర్యము అయ్యాయి.
తాగడానికి నీరు లేదు.
కలుషిత జలము సేవించినందువల్ల జబ్బులు వస్తున్నాయి.
జలము లేక వృక్షాలు ఎండిపోయి, సస్యశ్యామలమైన మైదాన ప్రాంతాలు ఎడారులుగా అవుతున్నాయి.
వన (వృక్ష) సంపద నశించడము వల్ల వర్ష క్రమము గతి తప్పింది.
తాగు నీరు లేక జంతువులు నశిస్తున్నాయి.
ఎవరు కారణము దీనికి?
మనుషుల స్వార్ధమే దీనికి కారణము.
జల ఆవాసాలు పూడ్చి అమ్ముకుంటున్న మనిషి దీనికి కారణము.
జలాశయాల అభివృద్ధికి ఇచ్చిన వనరులను దిగమింగిన భ్యూరోక్రాట్లు కారణము.
రాజకీయనాయకులు కారణము
ప్రజల స్వార్థము, మరియు అజ్ఞానము కూడా కారణము.
నీటి వనరులను రక్షించండి. భూగర్భ జలాలను సంరక్షించండి. ప్రాణికోటి మనుగడకు సహాయము చేయండి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.