Tuesday, January 27, 2015

లక్షలాది మంది పిల్లలు దుర్భర పేదరికములో జీవిస్తున్నారు

కోట్లాదిగా పిల్లలు కడు పేదరికములో జీవిస్తున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే.

కాని ఎవరు మాట్లాడరు.

ఇంత మంది పిల్లలు ఈ విదముగా కావడానికి కారణాలు ఏమిటి?

ఇంత పిల్లలను కంటున్నవారు ఎవరు? ఎందుకు?

సమాజము ఎంత మంది పిల్లలను పోషించగలదు?
ప్రభుత్వము ఎంత మంది పిల్లలను పోషించగలదు?
NGO's ఎంత మంది పిల్లలను పోషించగలరు?
ఇతరులు ఎంత మంది పిల్లలను పోషించగలరు?

సమస్య ఎక్కడ ఉంది?

పోషించలేనప్పుడు పిల్లలను ఎందుకు కంటున్నారు? ఎవరు వీళ్ళు. జనగణన లో ఈ విషయము తేల్చరు ఎందుకని?

ఇలాంటి పిల్లల పై సమగ్ర సర్వే ఎందుకు చేయరు? వీరి తల్లిదండ్రులు ఎవరు, వారి కులము,మతము ఏమిటి, వారు ఏ విలువలు పాటిస్తున్నారు?, వాళ్ళు ఎక్కువ పిల్లలను ఎందుకు కంటున్నారు? etc.

పిల్లలను కని సమాజము మీద వదిలితే, ఏవైనా శిక్షలు వేయాలా లేదా అని న్యాయ నిపుణులు, చట్ట సభలు ఎందుకు చర్చించవు?

ఇలా చాలా ప్రష్నలు మీ ముందుకు వస్తాయి. వాటిని పక్కన పెట్టి, ఈ పిల్లలు ఎదుర్కోంటున్న సమస్యలను చూద్దాము.

-- ఆకలి
-- రక్షణ లేకపోవడము
-- అనారోగ్యము
-- వెట్టి చాకిరి
--  నిరక్షరాశ్యత
-- చిన్న వయసులోనే పడుపు వృత్తిలోకి నెట్టబడడము
-- నేరాలు ఆపాదించి వారిని క్రిమినల్స్ గా తయారు చేయడము
-- వయసుకు మించిన శ్రమ
-- గూడు లేక పోవడము
-- గుడ్డలు లేక పోవడము
-- మానసిక భయాలు, రుగ్మతలు
-- శారీరక ఎదుగుదల సరిగా లేకపోవడము
-- మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడము
--  సమాజానికి ఉపయోగపడే విదముగా వీళ్ళు పెరగక పోవడము
-- పేదరికము
--

ఆడ పిల్లల పరిస్థితి మరీ హీనముగా ఉంటుంది.

లక్షల కోట్ల సంపద దోసి విదేశాలు తరలించే శక్తులు సిగ్గుతో తలవంచుకోవాలి. రాజమహల్ లను తలదన్నే ఇళ్ళు కట్టుకుని, అందులో 7 start facilities ఏర్పరచుకుంటున్న శక్తులు సిగ్గు పడాలి.

ఈ మోహాలకు ఇంటి లో సినిమా దియేటర్లు, fitness centers, etc కావాల్సి వచ్చింది. ఒక పక్క కోట్లాది పిల్లలు కడు పేదరికములో మగ్గిపోతుంటే, ఈ శక్తులు ప్రజలను మతాలుగా విభజించి, 45% ఓట్లు దోబ్బి, అధికారము కోసము అర్రులు చాస్తున్నాయి.

ఈ పిల్లలందరికి లబ్ధి కలిగే విదముగా ఏవైనా ప్రభుత్వ పధకాలు ఉన్నాయా? ఉంటే అవి వీరికి చేరుతున్నాయా?

"ఓటు బ్యాంకు" రాజకీయాలను పక్కన పెట్టి, ఈ పిల్లలు పడుతున్న కష్టాలకు సరియైన ఉపాయాలు కనుక్కోవాలి.

ఈ పిల్లలలో అన్ని కులాలకు, మతాలకు, వర్గాలకు, భాషలకు, సామాజిక వర్గాలకు, సాంఘీక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పిల్లలకు మీ biased views ను ఆపాదించకండి.

ఈ పిల్లల సమస్యలకు, పరిస్కారము కనుక్కునేటప్పుడు, ఫలాన విషయము లేక solution కు
నా కులము ఒప్పుకోదు, లేకపోతే నా మతము ఒప్పుకోదు అన్న కుంటిసాకులు  చెప్పకండి.

మానవతా వాదము తో ఈ సమస్యకు పరిస్కారము కనుక్కోండి. నీ కులము, నీ మతము కంటే మానవత్వము గోప్పది.

side note:
"Begging" ను పూర్తిగా బాన్ చేయవలసిన అవసరము ఉందా?
 "Stray Animals"  రోడ్ల మీద తిరగకుండా చేయవలసిన వసరము ఉందా?





No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.