Friday, August 21, 2015

స్త్రీ లకు రక్షణ ఏది?

బాల్యము లో
యవ్వనము దశ లో
middle-age లో
ముసలి తనము లో

అన్ని దశలలో స్త్రీ లు ఇతరుల పై అధారపడి ఉండడము మీరు గమనించ వచ్చు.

వారికి ప్రాపర్టి రైట్స్ మితము గా ఉన్నాయి. అవి సక్రమముగా పని చేయడము లేదు.

-- పరిమిత విద్య
-- పేద రికము
-- forced పెళ్ళి. వీళ్ళకు మానసిక పరిపక్వత రాకుండానే, చిన్న వయసులో, వాళ్ళ అభీష్టము తెలుసుకోకుండానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. దీని తో వారి విద్య పాడు అవుతుంది. ఆ తరువాత పిల్లలు, రోగాలు, భర్త ధాష్టీకము. ఆ తరువాత ఎప్పుడో మధ్య వయసులో, అవసరమైన సమయములో ఉధ్యోగాలు ఏమి వస్తాయి. అప్పటికి వారి పేరు మీద ఆస్తి ఏమీ ఉండదు. బ్యాంకు లో బ్యాలెన్స్ ఉండదు. తల్లి/తండ్రి ముసలి వారు అయి ఉంటారు, వారి దగ్గర డబ్బు/సంపద ఉండదు. అప్పుడు అన్నల దగ్గర ఉండవలసిన పరిస్థితి. అది కడు దయనీయము.

-- ఉధ్యోగాలు లేకపోవడము
-- సంపద లేక పోవడము
-- సామాజిక రక్షణ లేకపోవడము
-- ఆర్ధిక రక్షణ లేకపోవడము
-- ఆరోగ్య రక్షణ లేదు
-- ఇతరుల పై (మగవాడి పై) ఆధార పడడము
--

ఇక ఎవడో గన్నాయి గాడు exploit చేస్తాడు.

స్త్రీ లకు రక్షణ ఏది? జవాబులు ఏమిటి?

స్త్రీ శిశువు పుట్టిన వెంటనే, (తన భాగము) ఆస్థి ఆమె పేరన పెట్టాలి అన్న చట్టము రావాలి. ఇది జరగకుండా, ఇక తాత/తండ్రి సంపాదించిన ఆస్తి పై ఎటువంటి క్రయ/విక్రయాలు జరగకూడదు అన్న దానిని ప్రభుత్వము గట్టిగా అమలు చేయాలి. ఆస్తి లేని కుంటుంబాలలో ఏమి చేయాలి?

చదువు మగ పిల్లలకు చెప్పించి, ఆడ పిల్లలకు వానా కాలము చదువు చెప్పించే పరిస్థిని మార్చాలి.

చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడము ఆపాలి.

ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ కనకుండా చేయాలి. Make this mandatory, irrespective caste, creed, religions, language, and region.

వంటరి ఆడవారికి వయసుతో నిమిత్తము లేకుండా, వారి కూడు/గుడ్డ/గూడు/ఆరోగ్య/విద్య/రక్షణ కు భంగము కలుగకుండా, ప్రభుత్వము విత్తము సమకూర్చాలి. Make this mandatory and a national priority. Two meals a day, decent place to live and protection.




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.