Tuesday, October 28, 2014

కే.సి.ఆర్. ప్రభుత్వము చేసిన ఒక మంచి పని

చెరువులను పునరుద్ధించి, అనుసంధానము చేసి, జల వనరులను సంరక్షించడానికి చర్యలు తీసుకోవడము ఒక మంచి పని. ఈ ప్రయత్నము ఫలించాలి అని ఆశిద్ధాము.

దీని వల్ల తాగు నీటి సమస్య పరిస్కారము అవుతుంది. దీని వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి.

మనుషులు, పశువులు, వృక్షాలు (అడవులు) లబ్ధి పోందుతారు(తవి).

కేంధ్ర ప్రభుత్వము మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి సంరక్షణ పై దృష్టి పెట్టాలి.

నీరు వృదాగా సముద్రములో కలసిపోవడము మంచిది కాదు.

నీటిని సంరక్షించడి, మీ జీవితాలు ఆనందమయము చేసుకోండి. నీటి రక్షణ విషయములో ప్రతి ఒక్కరు తమ నిజ స్వార్థాన్ని ఒక 50% తగ్గించుకుని, మిగతావారితో కలసి సామూహిక నీటి రక్షణ పధకాలకు (గ్రామ స్థాయి నుండి పైకి) సపోర్ట్ చేస్తే, జల సమస్య తీరిపోతుంది.

నాకెందుకు, నాకు అందిన చెరువు భూమిని ఆక్రమించుకుని, అమ్ముకుంటాను అని ప్రతి వాడు అనుకుంటే సమస్య తీవ్రము అవుతుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.