Friday, June 5, 2015

చట్టానికి అటు ఇటు

సమాజములో (ప్రజలలో) నీతి, న్యాయము, ధర్మము, రుజు వర్తన, రీత, morality, ఇవి అన్నీ నాశనము అవ్వడానికి కారణము తెల్లవాడు వ్రాసిన "చట్టము". ఒక విదముగా చూస్తే.

వాడి "చట్టము" ప్రకారము, సాక్షాధారాలు లేకపోతే, తప్పుడు గాడు కూడా "దొర" అన్నమాట. వాడు ఎంత పరమ నికృష్టుడు అయినా సరే.

వాడు అసత్యము పలుకుతాడు, వాడు అన్యాయము చేస్తాడు, వాడు ధర్మాన్ని పాటించడు, వాడు నీతి మాలిన వాడు, వాడికి రుజువర్తన లేదు, వాడు immoral, అయినా వాడు చట్టము దృష్టి లో దొర.

చట్టము లో ఉన్న ఈ లోసుగు తోనే, రాజకీయ నాయకులు, గూండాలు, డబ్బు ఉన్నవాడు, పలుకుబడి ఉన్న వాడు ప్రజాస్వామ్యాన్ని అపహాశ్యము చేస్తున్నాడు.

ఒకడు, 19 MLA seats గెలిసి, వాటిని అమ్ముకుని సోమ్ము చేసుకుని, కేంద్రములో మంత్రి అవుతాడు. అదే మంటే "చట్ట" ప్రకారము అది తప్పుకాదు అంటాడు.

మరి ఇక "సత్యము", "న్యాయము", "ధర్మము", "రుజువర్తన", "మోరాలిటి" అవసరము లేదా? వీటిని అనుసరించే వాళ్ళు అందరు దద్దమ్మలు అనా అర్ధము!?

చరిత్ర పుట్టిన కాలము నుండి, భారత దేశము గర్వించ దగ్గవి ఏవైనా ఉన్నాయి అంటే, అవి

-- "సత్యము పలకడము",  ఉదాహరణగా సత్య హరిశ్చంద్రుడు, ధర్మరాజు
-- ఇచ్చిన మాట తప్పకపోవడము, రాముడు
-- ధర్మమును అనుచరించడము, భారతము, శ్రీకృష్టుడు, భగవత్ గీత
-- నీతి గా బ్రతకడము,
-- రుజువర్తన కలిగి ఉండడము,
-- మోరల్ గా ఉండడము,
-- రణ రంగమున ఆయుధాలు పట్టని శతృవుని వదలి పెట్టడము - రాజ్ పుట్స్. ఒక పక్క అరబ్బులు, రెండవ పక్క తెల్లవాడు మారణహోమము చేసినా, రాజ్ పుట్స్ ఈ నియమాన్ని తప్పలేదు.

పై విషయాలు నేను/నువ్వు చెప్పడము కాదు. వేల సంత్సరాలుగా భారత దేశము వచ్చి చూసి వెళ్ళిన విదేశీ యాత్రికులు వ్రాసిన విషయాలు. తెల్లవాడి శంఖములో పోస్తేనే కాని తీర్థము కాదు చాలామంది భారతీయులకు.

సామాన్య ప్రజలు సైతము మన సనాతన గ్రంధాలు చెప్పిన విదముగా రుజు వర్తన కలిగి ఉండేవారు. ఇది 1950 వ దశకము దాకా ఎక్కువ శాతము ప్రజలు నడిచిన మార్గము.

ఎప్పుడైతే "చట్టము", నువ్వు తప్పు చేసినా, సాక్షాధారాలు లేకుండా చూసుకుంటే, నువ్వు దొరవే అని వెసలుబాటు ఇచ్చాయో, అప్పుడే మన సమాజము పూర్తిగా పతనము అయ్యిది. అదేమంటే అవి తెలివితేటలు అంటున్నారు.

ఒకడు ఒక తప్పు (ఒక MLA ని ప్రలోభ పెట్టడము) చేస్తే నేరము అయినప్పుడు, రెండో వాడు అదే తప్పును 12 రెట్లు ఎక్కువగా చేసి (12 MLA లను కొంటే, ప్రజల తీర్పును కాలరాసి) సాక్షాధారాలు లేవు కాబట్టి నేను దొరనే అంటే, దానిని "చట్టము" వప్పుకుంటే, ఇక ఇది కలి యుగము కాక ఇంకేమిటి.

నువ్వు సాక్షాధారాలతో చట్టానికి దోరకనంత వరకు దొరవే. ఇంకా నువ్వు "చట్టానికి అతీతము గా" ఉన్నంత వరకు దోరవే.

"చట్టానికి అతీతముగా" ఉండడము అంటే, ఉదాహరణకు జయ, జగన్, లాలూ, సోనియా, రాజీవ్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, చిరంజీవి*, ఈ లిష్ట్ చాలా పెద్దది.

* పది కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఏమయ్యింది? ఏమీ కాలా.

అంటే నీకు రాజకీయ అధికారము, డబ్బు, పలుకుబడి ఉంటే నువ్వు చట్టానికి అతీతుడివి అన్నమాట.

ఇంకా చాలా ఉదాహరణలు ఇవ్వవచ్చు. కాని .... అసలు విషయము అర్ధము అయితే అంతే చాలు. బ్లాగులలో మనము వ్రాసిన దానిని, ఎదుటి వాడు చదివేటప్పటికే, చాలా communication gap వస్తుంది. మనము వ్రాసిన దానిని ఎదుటి వాడు యధా తధముగా అర్థము చేసుకోవడము చాలా తక్కువగా జరుగుతుంది. వాడు ఇంకేదో మీనింగులు తీస్తాడు, ఉదాహరణలు ఇస్తాడు.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.